ఫిబ్రవరి 16న హైదరాబాద్ లో నీటి సరఫరా బంద్

 ఫిబ్రవరి 16న హైదరాబాద్ లో నీటి సరఫరా బంద్

హైదరాబాద్,వెలుగు:  సింగూరు ప్రాజెక్టులో భాగంగా పెద్దాపూర్ పంప్ హౌజ్ వద్ద నిర్వహణ పనులతో  శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నీటి సరఫరా బంద్ కానుంది. సిటీలో కొన్ని ప్రాంతాల్లో పాక్షిక, మరికొన్ని చోట్ల  పూర్తిగా సరఫరా ఉండదని వాటర్​బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. షేక్ పేట్ రిజర్వాయర్(పూర్తిగా), భోజగుట్ట (పాక్షిక), బంజారా, ఎర్రగడ్డ రిజర్వాయర్ల ప్రాంతాల్లో (పాక్షిక), బోరబండ రిజర్వాయర్ ప్రాంతాల్లో (పూర్తిగా), లింగంపల్లి రిజర్వాయర్ ప్రాంతాల్లో, ఆన్ లైన్ సప్లయ్(పూర్తిగా), ఖానాపూర్ గ్రావిటీ 1200 ఎంఎం మెయిన్ ఆన్ లైన్ సప్లయ్ ప్రాంతాల్లో (పూర్తిగా) నీటి సరఫరా బంద్ అవుతుందని అధికారులు తెలిపారు.